Home   »  జాతీయం   »   నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

schedule mahesh

Union Budget | మరికొద్ది నెలల్లో దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ రెండో దఫా పాలనలో చివరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆమె పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

nirmalasitharaman-will-present-interim-budget

Union Budget | మరికొద్ది నెలల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రెండో దఫా పాలనలో చివరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆమె పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్యంతర బడ్జెట్‌లో తాయిళాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

బడ్జెట్‌లో మహిళలను ఆకర్షించే ప్రకటనలు ఉండే అవకాశం

అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని, మహిళా సాధికారిత పెరగాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో వారికి పెద్దపీట వేయొచ్చని విశ్లేషకులు భావిస్తోన్నారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలవల్ల రైతుల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు ప్రయత్నించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆదాయపు పన్నులో మరింత ఉపశమనం పొందాలని ఉద్యోగులు కోరుతున్నారు.

వరుసగా ఆరోసారి Budget ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

నిర్మల సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన అభివృద్ధి, సంక్షేమం, విధానాలను వివరించే రాజకీయ పత్రంగా ఈ బడ్జెట్ ఉంటుందని పలువురు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాంకేతికంగా ఓటాన్‌ అకౌంట్‌గా పనిచేసే ఈ మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న కేటాయింపులకు, ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల నిధులను ఖర్చు చేయడానికి పార్లమెంట్ ఆమోదం అవసరం. ఏప్రిల్/మేలో కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Also Read | మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంకు మరోసారి ED నోటీసులు