Home   »  జీవన శైలి   »   రోజూ 2 బొప్పాయి ముక్కలు తింటే..ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు..

రోజూ 2 బొప్పాయి ముక్కలు తింటే..ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు..

schedule mounika

Papaya Fruit Benefits | బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో ఎక్కువగా విటమిన్-C, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలో మంచి మార్పులని తీసుకొస్తాయి. కావున బొప్పాయి పండు రోజూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Papaya Fruit Benefits

Papaya Fruit Benefits | మన ఆహారంలో రోజూ బొప్పాయి పండును తీసుకోవచ్చు. ఈ పండులో బైపాన్ ఎంజైమ్ ఉంటుంది. దీని వల్ల అజీర్ణం, ఊబకాయం వంటి శరీర సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా రోజూ పరగడపున 2 బొప్పాయి ముక్కలు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండుని రెగ్యులర్‌గా తింటే మలబద్ధకం సమస్య దరిచేరదు..

బొప్పాయి పండుని రెగ్యులర్‌గా తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుందని, కొందరికి భోజనం చేశాక ఆకలి వేస్తుంది. స్నాక్స్ తినే టైమ్‌లో తినొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండుని తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, తాపజనక ప్రేగు వ్యాధులు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Papaya Fruit Benefits | బొప్పాయి పండు తింటే కలిగే లాభాలు..

శరీరంలో అనేక సమస్యలకు దీర్ఘకాలిక మంట కారణం. ఇందుకోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి. అందుకే కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. బొప్పాయి రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు..

బొప్పాయి పండులో విటమిన్-A, C, B, కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి వివిధ ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి HDL కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి పండులో కేలరీలు తక్కవగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గే డైట్ లో బొప్పాయిని కూడా చేర్చుకుంటే లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండులో క్యాన్సర్ నిరోధక గుణాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి పండును అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..

బొప్పాయి పండును అధికంగా తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. బొప్పాయిని గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో లేదా బాగా ఆకలిగా ఉన్నప్పుడు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది గర్భస్రావం వంటి సమస్యలను కలిగిస్తుంది. పాలిచ్చే తల్లులు బొప్పాయి పండు తినకుండా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం అని గమనించగలరు.

ALSO READ: గుప్పెడంత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పోషకాలు కచ్చితంగా తీసుకోండి..

.