Home   »  రాజకీయం   »   లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది : పురందేశ్వరి

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది : పురందేశ్వరి

schedule mounika

విజయవాడ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) ఆశాభావం వ్యక్తం చేసారు.

Purandeswari

విజయవాడ: భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి BJP పార్టీ క్యాడర్‌తో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ… AP బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 25 పార్లమెంటు ఎన్నికల కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ మహిళలకు పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా గెలుచుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారన్నారు. నియంతృత్వం, విద్వేషం, విధ్వంసాలతో కూడిన పాలనను ఏపీలో గత అయిదేళ్లుగా చూస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు.

ఎన్ని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారో ప్రభుత్వం చెప్పాలి: Purandeswari

రాజధాని అమరావతిని విస్మరించి రాష్ట్రాన్ని ప్రభుత్వం తలలేని సంస్థగా మార్చిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉంది: పురంధేశ్వరి

బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే, దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడిపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన విధ్వంసకరమని, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు ప్రజలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ కార్యకర్తలు గళం విప్పాలని ఆమె అన్నారు.

ఫిబ్రవరి 9 నుంచి BJP పార్టీ ‘పల్లెకు పోదాం’ ప్రచారాన్ని చేపడుతుంది: పురంధేశ్వరి

ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు BJP పార్టీ ‘పల్లెకు పోదాం’ ప్రచారాన్ని చేపడుతుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పోరు యాత్ర’ నిర్వహిస్తామని, శ్రేణులు సంక్షేమానికి పెద్దపీట వేస్తారని భావిస్తున్నానని పురంధేశ్వరి తెలిపారు.

ALSO READ: జగన్ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి : చంద్రబాబు