Home   »  టెక్నాలజీ   »   రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV F-14 రాకెట్..!

రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV F-14 రాకెట్..!

schedule raju

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) Satish Dhawan Space Centre (SDSC) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు GSLV F-14 రాకెట్‌ను ప్రయోగించనుంది. 2,272 కిలోల బరువున్న INSAT-3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ యొక్క లక్ష్యం.

Countdown for tomorrow GSLV F-14 mission to begin today

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) Satish Dhawan Space Centre (SDSC) లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు GSLV F-14 రాకెట్‌ను ప్రయోగించనుంది. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (MRR) సమావేశం అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (LAB) ప్రయోగ పనులకు ఆమోదం తెలిపింది.

మధ్యాహ్నం ప్రారంభంకానున్న GSLV F-14 కౌంట్‌డౌన్

తదనంతరం, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ల్యాబ్ సమావేశం నిర్వహించబడింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 నుండి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ అనంతరం GSLV F-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ఈ మిషన్ యొక్క లక్ష్యం 2,272 కిలోల బరువున్న ఇన్‌శాట్-3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. ఇది షార్ కేంద్రం నుండి 92వ ప్రయోగం మరియు GSLV సిరీస్‌లో 16వ ప్రయోగం. అలాగే ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి క్రయోజెనిక్ ఇంజిన్‌ల ద్వారా లాంచ్ చేసే 10వ ప్రయోగం అని ఇస్రో అధికారులు తెలిపారు.

Also Read: ISRO నుండి మరో ముఖ్యమైన ప్రాజెక్ట్.. వాతావరణ అధ్యయనం కోసం సిద్ధంగా ఉన్న INSAT-3DS