Home   »  వినోదం   »   పుష్ప-3 సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

పుష్ప-3 సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

schedule raju

Pushpa 3 | జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్‌లో ‘పుష్ప’ సినిమా మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ ప్రత్యేక ప్రదర్శన చేయబడింది. ఈ క్రమంలో పుష్ప పార్ట్-3 (Pushpa 3) గురించి బన్నీ వ్యాఖ్యానించాడు.

Allu Arjun gave clarity on Pushpa-3 movie

జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25 వరకు జర్మనీలో 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఇప్పటికే భారతదేశంలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకోగా ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “పుష్ప” సందడి

ఈ ఫెస్టివల్‌లో ‘పుష్ప’ సినిమా మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ఈ సినిమా స్క్రీనింగ్ తర్వాత అల్లు అర్జున్ అంతర్జాతీయ ఫిలిం మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్టులతో కాసేపు చర్చించారు. అనంతరం అల్లు అర్జున్ ఇండియన్ సినిమా ప్రాముఖ్యత, చరిత్ర గురించి మాట్లాడారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్-3 (Pushpa 3) గురించి బన్నీ వ్యాఖ్యానించాడు. అంతా సవ్యంగా జరిగితే పుష్ప-3 కూడా రావచ్చు. పుష్ప సినిమాను సిరీస్ గా తీసుకురావాలని యోచిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపాడు.

పుష్ప పార్ట్-3 (Pushpa 3)పై ప్రకటన

అంతా సవ్యంగా జరిగితే పుష్ప-3 కూడా రావచ్చు. పుష్ప సినిమాను సిరీస్ గా తీసుకురావాలని యోచిస్తున్నట్లు అల్లు అర్జున్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలిపాడు. సెకండ్ పార్ట్ విడుదలైన తర్వాత పార్ట్-3పై ప్రకటన వస్తుందని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్ మరియు సందీప్ రెడ్డి వంగాలతో సినిమాకు ఒప్పుకున్నాడు. బోయపాటి శ్రీనుతో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో పుష్ప-3 రావడం అంత ఈజీ కాదని చెప్పొచ్చు.

పుష్ప సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, Y. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం పుష్ప పార్ట్-2 ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Also Read: Pushpa2TheRule | జపాన్‌కు వెళ్లనున్న “పుష్ప-2” టీమ్‌.!