Fire in Visakhapatnam | విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్యాపిటివ్ పవర్ ప్లాంట్లో తప్పిదం కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతంలో పొగ కమ్మేసింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తార్ ప్లాంట్ లో నిప్పురవ్వలు పడటంతో మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలకు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read | బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8మంది మృతి..!