Home   »  క్రీడలు   »   ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన భారత్

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన భారత్

schedule mahesh
india-won-gold-in-asian-badminton-championship

Asian Badminton Championship | భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు తొలిసారి స్వర్ణం సాధించింది. PV సింధు సారథ్యంలోని టీమ్ ఇండియా ఆసియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.

3-2తో తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన భారత్

ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-2 తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించి తొలిసారి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీని గెలుచుకుంది. గతంలో ఈ టోర్నీలో పురుషుల జట్టు రెండుసార్లు (2016, 2020) కాంస్య పతకాలు సాధించింది. టైలో భాగంగా జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రెండు ఒలింపిక్ పథకాల విజేత PV సింధు 21-12, 21-12తో సుపనిదా కాటెథాంగ్‌పై విజయం సాధించి శుభారంభం చేసింది.

తొలిసారి ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన భారత్

గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి పుంజుకునేందుకు కాస్త సమయం తీసుకున్న తెలుగమ్మాయి PV సింధు ఆసియా చాంపియన్‌షిప్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుంది. డబుల్స్‌ పోరులో పుల్లెల గాయత్రి గోపీచంద్‌ – త్రిసా జాలీ జంట 21-16, 18-21, 21-16తో జాంకోల్ఫాన్‌ – రవిండా ద్వయంపై గెలుపొందింది. అనంతరం జరిగిన సింగిల్స్‌లో అశ్మిత చలిహా, డబుల్స్‌లో శృతి – ప్రియ ఓటమి చవిచూశారు. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఆ తరవాత జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో 17 ఏండ్ల అన్మోల్‌ 21-14-21-9తో ప్రత్యర్థిని చిత్తుచేయడంతో భారత జట్టు 3-2తో ఆసియా బ్యాడ్మింటన్ టీం ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది.

Also Read | అండర్‌-19 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా