Home   »  రాజకీయం   »   ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన అమిత్ షా..!

ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన అమిత్ షా..!

schedule mahesh
amit-shah-fires-on-the-india-alliance

Amit Shah | కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇది వారసత్వ పార్టీల అహంకార కూటమి అని ధ్వజమెత్తారు.

“నేషన్ ఫస్ట్” విధానాన్ని NDA పాలసీగా పేర్కొన్న Amit Shah

ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలపై ఆయన మండిపడ్డారు. దేశంలో అవినీతికి మూలం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. “నేషన్ ఫస్ట్” విధానాన్ని NDA పాలసీగా పేర్కొన్నారు. దేశాన్ని స్వావలంబన చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు. మరి ఇండియా కూటమి ఏ లక్ష్యం కోసం పనిచేస్తోందని అమిత్ షా ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సోనియా గాంధీని విమర్శించారు.

శరద్ పవార్ తన కుమార్తె, మమతా బెనర్జీ తన మేనల్లుడు, స్టాలిన్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తమ కుమారులను సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మోదీ 3.0లో ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం నుండి భారత్ విముక్తి పొందుతుందని, శాంతియుత, సంపన్న దేశంగా అభివృద్ధి చెందుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read | కాంగ్రెస్ నేతలతో భేటీపై స్పందించిన ఈటల రాజేందర్