Home   »  క్రీడలు   »   రాంచీ టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్‌

రాంచీ టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్‌

schedule mahesh

India vs England 4th test match | భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టు (Ranchi Test) మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది.

india-vs-england-4th-test-match

India vs England 4th test match | రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టు (Ranchi Test) మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఉదయం రెండో రోజు ఆటలో జడేజా చివరి మూడు వికెట్లు తీశాడు.

సెంచరీతో ఆదుకున్న జో రూట్

ఇంగ్లాండ్ చివరి మూడు వికెట్లను కేవలం ఆరు పరుగుల తేడాతో నష్టపోయింది. తొలిరోజు ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ 122 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. శుక్రవారం ఒక దశలో ఇంగ్లండ్ 112 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది.

అయితే ఈ సిరీస్ ఆరంభంలో పెద్దగా రాణించని జో రూట్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. 274 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జో రూట్, ఆల్ రౌండర్ ఆలీ రాబిన్సన్‌తో కలిసి 8 వికెట్లకు 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

4 వికెట్లతో సత్తా చాటిన జడేజా

భారత బౌలర్లలో స్పిన్నర్ జడేజా నాలుగు వికెట్లు తీశాడు. రాజ్‌కోట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జడ్డూ రాంచీలోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. స్పీడ్ బౌలర్ ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

Also Read | IPL-2024 సీజన్ మొత్తానికి దూరమైన భారత స్టార్ పేసర్..