Home   »  తెలంగాణ   »   కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి..

schedule mounika
Jeevan Reddy

హైదరాబాద్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేరును ఖరారు చేసింది. మన్నె జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారని AICC ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తెలిపారు.

జీవన్ రెడ్డి (Jeevan Reddy) గత నెలలో భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి వైదొలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను మహబూబ్ నగర్ బీఆర్‌ఎస్‌ MP మన్నె శ్రీనివాస్ రెడ్డికి మేనల్లుడు. కాగా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు చెందిన N.నవీన్‌కుమార్‌రెడ్డితో తలపడనున్నారు. BRS అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి KCR ఉప ఎన్నికకు నవీన్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే.

భారత ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 4 నుంచి మార్చి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 28న ఎన్నికలు, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ALSO READ: గత ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించింది :CM రేవంత్‌రెడ్డి