Home   »  జీవన శైలి   »   బత్తాయిలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

బత్తాయిలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

schedule mounika

Mosambi Benefits | బత్తాయిలు రెగ్యులర్‌గా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. అంతేకాకుండా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైనా తినవచ్చు. ఇందులో ఎక్కువగా విటమిన్ “C” ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బత్తాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కావున బత్తాయిలు తినడం వల్ల మనం జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

Mosambi Benefits | అలర్జీలను తగ్గించడంలో బత్తాయిల పాత్ర..

బత్తాయిలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా వరకూ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అదే విధంగా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అలర్జీలను కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బత్తాయిల పాత్ర..

బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలు ఉన్న పండ్లు తీసుకోవాలి. బత్తాయిలలో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి, బరువు కూడా అదుపులో ఉంటుంది. బత్తాయిలు తినడం వల్ల గుండె యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తినాలి. బత్తాయిలు రెగ్యులర్‌గా తింటే బత్తాయిలలో ఉండే పీచు పదార్థం కారణంగా దంత సమస్యలు దూరమవుతాయి.

ALSO READ: డిన్నర్‌లో వీటిని తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశం..