Home   »  జీవన శైలి   »   ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ డ్రింక్స్ తాగండి.

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ డ్రింక్స్ తాగండి.

schedule mounika

summer | ఎండాకాలం వచ్చేసింది. ఈ టైమ్‌లో గొంతులో చల్లగా ఏమైనా పడితే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది. కావున ఈ ఎండాకాలంలో చల్లగా సేదతీర్చే డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.

summer | ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే డ్రింక్స్..

పుచ్చకాయ: ఎండాకాలం అనగానే గుర్తొచ్చే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.

మజ్జిగ: ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు పెరుగు, కాస్త ఉప్పు కలిపి మజ్జిగను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను, పొట్టను, పేగులను కూడా మజ్జిగ ఆరోగ్యంగా ఉంచుతుంది.

నిమ్మరసం : ఎండాకాలంలో నిమ్మకాయలు కూడా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ “C” చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మ రసాన్ని నీటిలో పిండి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేసి షర్బత్‌లా తీసుకోండి.

కొబ్బరి నీళ్లు: ఎండాకాలంలో మరో హెల్దీ డ్రింక్ కొబ్బరి నీళ్లు అని చెప్పొచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యం మెరుగుదలకు కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి.

చెరకు రసం: ఎండాకాలంలో చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు శక్తి లభిస్తుంది.

ALSO READ: ఎండాకాలంలో మునక్కాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..