Home   »  ఉద్యోగం   »   తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి జూన్ లో నోటిఫికేషన్?

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి జూన్ లో నోటిఫికేషన్?

schedule mounika
TS Health Department

TS Health Department | తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి K. రామకృష్ణా రావు (IAS) ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వైద్యారోగ్య సర్వీసు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జూన్ లో నోటిఫికేషన్ రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, తెలంగాణ వైద్యారోగ్య శాఖ (TS Health Department) లో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

ALSO READ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 SI, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..