Home   »  క్రీడలు   »   హైదరాబాద్ Vs చెన్నై.. టికెట్ల బుకింగ్ షురూ..!

హైదరాబాద్ Vs చెన్నై.. టికెట్ల బుకింగ్ షురూ..!

schedule raju

IPL 2024 SRH vs CSK Tickets | IPL 2024లో భాగంగా హైదరాబాద్ లో జరగబోయే రెండవ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. అయితే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రెండవ మ్యాచ్ ఏప్రిల్ 5న జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు సోమవారం (మార్చి 25) నుంచి ప్రారంభమయ్యాయి.

IPL 2024 SRH vs CSK Tickets Bookings Started

IPL 2024 SRH vs CSK Tickets | హైదరాబాద్ లో IPL సందడి మొదలైంది. IPL-2024లో భాగంగా ఏప్రిల్ 5న HYDలో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://insider.in/hyderabad వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రెండు టికెట్లు కొంటే ఒక ఫ్యాన్ జెర్సీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సన్‌రైజర్స్, చెన్నై మ్యాచ్ టికెట్లు | IPL 2024 SRH vs CSK Tickets

IPL 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు సోమవారం (మార్చి 25) నుంచి అందుబాటులోకి వచ్చాయి. పేటీఎం ఇన్‌సైడర్ లో ఈ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా సన్ రైజర్స్ వెల్లడించింది.

IPL రెండవ మ్యాచ్ టికెట్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కనిష్ఠంగా రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ.4500 టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసుకునే స్టాండ్స్ ను బట్టి టికెట్ల ధరలు ఉంటాయి. వీటిలో రూ.1500, రూ.2500, రూ.4000 వేలు, రూ.4500 ధరల్లో టికెట్లు ఉన్నాయి. రూ.1500 టికెట్ అంటే సౌత్ ఈస్ట్ సెకండ్ టెర్రస్ పై ఉండే సీట్లు.

ఇక రూ.2500 టికెట్లు కొంటే ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ లలో ఉండే సీట్లలో కూర్చోవచ్చు. రూ.4000 టికెట్లు తీసుకుంటే వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవచ్చు. ఇక రూ.4500 టికెట్ కొంటే ఈస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చొని మ్యాచ్ చూడవచ్చు. ఈ నాలుగు డినామినేషన్లలో రెండవ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికోసం పేటీఎం ఇన్‌సైడర్ (paytm insider) వెబ్‌సైట్లోకి వెళ్లి మ్యాచ్, స్టాండ్ ఎంపిక చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Also Read: IPL 2024లో 6 వికెట్ల తేడాతో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!