Home   »  చదువు   »   TS TET Fee | టెట్ ఫీజు తగ్గించేందుకు ప్రభుత్వం యోచన..?

TS TET Fee | టెట్ ఫీజు తగ్గించేందుకు ప్రభుత్వం యోచన..?

schedule raju

TS TET Fee | తెలంగాణ TSటెట్‌ ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గతంలో ఒక పేపర్ రాస్తే రూ. 300గా ఉంటే ఈసారి మాత్రం రూ. 1000కి పెరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Government plans to reduce TS TET Fees

తెలంగాణ: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TSTET) ఒక్కో పేపర్ ఫీజును రూ.300 నుంచి రూ.1,000కి పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, హాస్టళ్లకు వేలు ఖర్చు పెడుతున్న తమపై ఫీజుల భారం వేయడం తగదని, వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం CM రేవంత్ దృష్టికి వెళ్లింది. ఫీజు పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని CMO వర్గాలు ఆయనకు తెలిపినట్లు సమాచారం. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిసారి పెరుగుతున్న TS TET Fee

రాష్ట్ర ఏర్పాటు తర్వాత టెట్‌ పరీక్ష నిర్వహిస్తూ వస్తున్న ప్రతిసారి పరీక్షా ఫీజును అంతో ఇంతో పెంచుతూ వస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ పరీక్షా ఫీజు ఏకంగా రూ. 1000కి చేరింది. ఫలితంగా ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులు వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో తొలిసారి TET ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు ఈ పరీక్షా ఫీజు కేవలం రూ. 200గా ఉంది. ఆ తర్వాత 2017లోనూ అదే ఫీజును కొనసాగించారు. ఆ తర్వాత దీనిని 300 చేశారు. గతేడాది నిర్వహించిన పరీక్షకు ఫీజు రూ. 400గా నిర్ణయించారు. రెండు పేపర్లకు కలిపి ఈ ఫీజు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఒక్క పేపర్ రాసేందుకే రూ. 1000గా నిర్ణయించారు. రెండు పేపర్లు రాస్తే రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో భారీగా దరఖాస్తు రుసుం పెంపుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TS TET Fee పెంపుపై CMO ఆరా

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా TET ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనించి ఉండాలని CMO భావిస్తుంది. సమస్య మరింత ఉదృతం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని CMO భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం.

Also Read: AP TET 2024 అడ్మిట్ కార్డులు విడుదల చేసిన AP ప్రభుత్వం..!