Game Changer jaragandi song | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్ రిలీజ్ అయ్యే డేట్, టైమ్ ను డైరెక్టర్ శంకర్ ఫిక్స్ చేశాడు. కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ పాట రానుంది.
ప్రధానాంశాలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ S. శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. గత మూడేళ్ళగా షూటింగ్ లోనే ఉన్న ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ మరియు టైటిల్ తప్ప మరో అప్డేట్ లేదు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగాఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాపై ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు.
జరగండి జరగండి పాట రిలీజ్ డేట్ | Game Changer jaragandi song
ఈ మూవీ నుంచి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ‘జరగండి జరగండి’ పాట (Game Changer jaragandi song) రిలీజ్ డేట్, టైమ్ ను శంకర్ రివీల్ చేశాడు. రేపు చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా ఉదయం 9 గంటలకు థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. పాటకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. గతేడాది దీపావళికే వస్తుందనుకున్న ఈ పాట ఇప్పుడు చరణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులను అలరించడానికి వస్తోంది.
రామ్ చరణ్, కియారా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.110 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తమ OTTలోనే రాబోతోందని ప్రైమ్ వీడియోనే ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
గేమ్ ఛేంజర్ విడుదల తేదీ
‘గేమ్ ఛేంజర్’లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని, ఏప్రిల్ చివరి నాటికి చరణ్ తన షూట్‌ను పూర్తి చేసి బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాకి వెళ్లనున్నాడని సమాచారం.
Also Read: రామ్ చరణ్ RC17 సినిమా నుండి తాజా అప్డేట్..!