Home   »  జాతీయం   »   NIA కొత్త డైరెక్టర్ జనరల్‌ ఎవరో తెలుసా..?

NIA కొత్త డైరెక్టర్ జనరల్‌ ఎవరో తెలుసా..?

schedule raju

Sadanand Vasant Date | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొత్త అధిపతిగా మహారాష్ట్ర ATF చీఫ్ సదానంద్ వసంత్ దాతె నియమితులయ్యారు. అంతే కాకుండా, జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (NDRF) అధిపతిగా అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్ ను కేంద్రం నియమించింది.

Sadanand Vasant Date as Director General of NIA

నూతన అధిపతిగా మహారాష్ట్ర ఆంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATF) చీఫ్ సదానంద్ వసంత్ దాతెను (Sadanand Vasant Date) జాతీయ దర్యాప్తు సంస్థ NIA డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈనెల 31న రిటైర్ కానున్నారు.

ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్న వసంత్ (Sadanand Vasant Date) 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. 26/11 ముంబై పేలుళ్ల ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌ను ఈయనే పట్టుకున్నారు. అప్పుడు ఈయన ముంబై అడిషనల్ CPగా పనిచేస్తున్నారు.

మరోవైపు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అధిపతిగా అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్​ను కేంద్రం నిమించింది. ఆనంద్‌ ప్రస్తుతం CISF ప్రత్యేక DGగా ఉన్నారు. అంతే కాకుండా, రాజస్థాన్‌ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ IPS అధికారి రాజీవ్‌ కుమార్‌ శర్మ ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌’ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన 2026 జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. SPG అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా S.సురేశ్‌ను నియమించారు.

Also Read: Taj Mahal | తాజ్‌మహల్‌ను శివాలయంగా మార్చాలని ఆగ్రా కోర్టులో కొత్త పిటిషన్‌.?