Naveen Polishetty | టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో బైక్ మీద నుంచి జారి పడటంతో చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించారని, రెండు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అతనికి గాయం అయి రెండ్రోజులు అవుతోందని సమాచారం. నవీన్ కు జరిగిన ఈ ప్రమాదం గురించి ఇండస్ట్రీలో కూడా ఎవరికీ తెలియదు. అతనే స్వయంగా తన టీమ్ కి మెసేజ్ పెట్టిన తర్వాత ఈ విషయం తెలిసింది. ఈ ప్రమాదం వల్ల కనీసం 3 నెలలపాటు నవీన్ పొలిశెట్టి సెట్స్ మీదకు రావడం కష్టం అని వార్తలొస్తున్నాయి.