Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్..!

ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్..!

schedule raju

Election Campaign | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రచారం చేయనున్నారు.

Pawan Kalyan started Election Campaign today

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇదివరకే YCP అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 27న ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్రను మొదలుపెట్టారు. అదే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

మూడు విడతలుగా జనసేన ఎన్నికల ప్రచారం | Election Campaign

ఇందులో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని (Election Campaign) ప్రారంభించారు. ఆయన పర్యటనల షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పిఠాపురం కేంద్రంగానే AP వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు.

జనసేన ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా, ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ చేస్తూ షెడ్యూల్ రూపొందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నారని తెలిసిందే. సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్చి 30 (శనివారం) నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ ప్రచారం చేయనున్నారు.

పవన్ తొలి విడత ప్రచార షెడ్యూల్

  • మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటన
  • ఏప్రిల్ 3 – తెనాలి
  • ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
  • ఏప్రిల్ 5 – అనకాపల్లి
  • ఏప్రిల్ 6 – యలమంచిలి
  • ఏప్రిల్ 7 – పెందుర్తి
  • ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
  • ఏప్రిల్ 10 – రాజోలు
  • ఏప్రిల్ 11 – పి.గన్నవరం
  • ఏప్రిల్ 12 – రాజా నగరం

Also Read: నంద్యాలలో రెండో రోజు ప్రారంభమైన బస్సు యాత్ర..!