చెన్నై: సినిమా రంగంలో విలన్ పాత్రలతో అదరగొట్టిన తమిళ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన తెలుపడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 48 ఏళ్ల బాలాజీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.
నేడు బాలాజీ మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబసభ్యులు, మిత్రులతో పాటు యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నివాళులు అర్పించే అవకాశం ఉండటంతో అంతిమ సంస్కారాల కోసం ఆయన భౌతికకాయాన్ని పురసవల్కంలోని ఆయన నివాసానికి తరలించారు. డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల చిత్రాలలో కూడా నటించారు.
Also Read: దేశంలో గుండెపోటు మరణాలు 12.5% పెరిగాయని NCRB నివేదిక