Home   »  తెలంగాణ   »   Hyderabad to Ayodhya | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసు

Hyderabad to Ayodhya | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసు

schedule raju

Hyderabad to Ayodhya | అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Direct flights from Hyderabad to Ayodhya

హైదరాబాద్‌: అయోధ్య (Ayodhya) రామయ్యను దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఇప్పుడు అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనార్థం హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సౌకర్యం (Hyderabad to Ayodhya) అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి G. కిషన్‌రెడ్డి తెలిపారు. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కిషన్‌రెడ్డి ట్విట్టర్ (X) ద్వారా తెలిపారు.

‘‘అయోధ్యకు నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని ఫిబ్రవరి 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశాను. ఆయన సానుకూలంగా స్పందించి, ఆ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు’’ అని కిషన్‌రెడ్డి వివరించారు. కాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. దీనితో భక్తులు హైదరాబాద్ నుంచి అయోధ్యకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు.

Hyderabad to Ayodhya విమాన సౌకర్యం స్పైస్‌ జెట్ షెడ్యూల్

మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అవే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ విమాన ప్రయాణ చార్జీలపై భక్తులకు 25 శాతం మేరకు రాయితీ ఇవ్వనున్నారు.

Also Read: విజయవాడ-అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు..!