Home   »  జాతీయం   »   కేజ్రీవాల్‌‌కు గట్టి షాక్.. జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు..!

కేజ్రీవాల్‌‌కు గట్టి షాక్.. జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు..!

schedule raju

Kejriwal | మద్యం పాలసీ కేసులో ED కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, AAP కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.

Kejriwal to appear in court today after ED custody ends

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన CM కేజ్రీవాల్‌‌కు (Arvind Kejriwal) కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ED కస్టడీ ముగియడంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఢిల్లీలో మే 25న 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఆయన అప్పటివరకు బయటికి వస్తారా? లేదా? అని పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి. విచారణ పేరుతో కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ను పొడిగిస్తే పోలింగ్ నాటికి ఆయన బయటికి రావడం కష్టమే.

భగవద్గీతతో జైలుకు Kejriwal

అరవింద్ కేజ్రీవాల్‌ 15 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో తనతోపాటు కొన్ని వస్తువులు జైలుకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అందులో మూడు పుస్తకాలు (భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్), స్పెషల్ డైట్, మెడిసిన్స్, ఓ కుర్చీ, టేబుల్‌తో పాటు ఓ లాకెట్‌ను తనతో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

జైలు నుంచి పరిపాలన సాగించనున్న తొలి సీఎం!

లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న CM కేజ్రీవాల్‌‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అయితే, అయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఇలా జైలు నుంచి పాలించిన తొలి CMగా కేజ్రీవాల్‌‌ నిలువనున్నారు. అయితే.. జైలు నుంచి ప్రభుత్వ పరమైన ఆర్డర్లు పాస్ చేయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.

తిహార్ జైలులో సెల్ కేటాయింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తిహార్ జైలులో అధికారులు సెల్ కేటాయించారు. జైలు నంబర్-2 కాంప్లెక్స్‌లో ఆయనకు సెల్ కేటాయించగా, అందులో కేజ్రీవాల్ ఒక్కరే ఉండనున్నారు. ఇదివరకు ఈ సెల్‌లో ఉన్న AAP ఎంపీ సంజయ్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం జైలు నంబర్-5 కాంప్లెక్స్‌కి మార్చారు. ఇదే కేసులో అరెస్టైన BRS MLC కవితను మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్-6 కాంప్లెక్స్‌లో ఉంచారు.

Also Read: ముగిసిన కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్..!