Home   »  వ్యాపారం   »   Today 01 April 2024 Stock Market | కొత్త సంవత్సరం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Today 01 April 2024 Stock Market | కొత్త సంవత్సరం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

schedule raju
Today 01 April 2024 Stock Markets

Today 01 April 2024 Stock Market | కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 73,968.62 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించాయి.

ఈరోజు (Today 01 April 2024 Stock Market) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు లాభపడి 74,014కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 22,464 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.64 వద్ద కొనసాగుతుంది. ఇంట్రాడేలో 73,909.39 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 36.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది.

ఇంట్రాడే ట్రేడింగ్ లో 22,529.95 పాయింట్లకు పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 135.10 పాయింట్లు పెరిగి, 22,462 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 3,015 షేర్లు పురోగమించగా, 572 షేర్లు క్షీణించాయి. 112 షేర్లు మారలేదు.

BSE సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

JSW స్టీల్ (4.81%), టాటా స్టీల్ (4.62%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.38%), NTPC (1.88%), L&T (1.66%).

టాప్ లూజర్స్:

టైటాన్ (-1.76%), నెస్లే ఇండియా (-1.43%), భారతి ఎయిర్ టెల్ (-0.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.77%), టెక్ మహీంద్రా (-0.45%).

Also Read: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు