చెన్నైలోని సౌకార్‌పేట్ ప్రాంతంలోని ప్రముఖ షాపింగ్ మాల్లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
సౌకార్‌పేట, హైకోర్టు యూనిట్ ఎస్ప్లానేడ్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు ప్రమాదం ఉదయం కావడంతో షాపింగ్ మాల్ లో ఎవరు లేరు.
ఈ అగ్నిప్రమాదంలో నగలు, మెడికల్ స్టోర్‌తో సహా కొన్ని దుకాణాలు పూర్తిగా దగ్ధం కావడం మినహా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.