Home   »  వార్తలు   »   వడదెబ్బ కారణంగా వరుడు పెళ్లికి ఒక రోజు ముందు మృతి

వడదెబ్బ కారణంగా వరుడు పెళ్లికి ఒక రోజు ముందు మృతి

schedule sirisha

ఆసిఫాబాద్‌: తెలంగాణలో పెళ్లికి ఒక రోజు ముందు వరుడు వడదెబ్బ కారణంగా మరణించాడు.

కౌటాల మండలం ఆసిఫాబాద్‌కు చెందిన వరుడు గుండ్ర తిరుపతి (26) పెళ్లికి సిద్ధమవుతుండగా వడదెబ్బకు గురయ్యాడు.

వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చినా తర్వాత అతనికి విరేచనాలు, వాంతులు అవుతుండటంతో అతని పరిస్థితి ఒక్కసారిగా క్షీణించి నేలమీద పడిపోయాడు.

వెంటనే తిరుపతిని కాగజ్ నగర్ సమీప ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా తిరుపతి రాత్రి 10 గంటలకు మృతి చెందాడు.

గత కొద్ది రోజులుగా కౌటాల మండలంలో ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40-43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

తెలంగాణలో వర్షాకాలం ఆలస్యం కారణంగా రాబోయే కొన్ని వారాల పాటు వేడి గాలులతో కూడిన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.

ప్రజలు తమను తాము రక్షించుకోవడం చాలా అవసరం అయితే సాధారణంగా ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 మధ్య రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఇంట్లోనే ఉండడం ఉత్తమం ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు అవసరం.