Home   »  తెలంగాణవార్తలు   »   రీల్ పెట్టు.. అవార్డు కొట్టు – తెలంగాణ అటవీశాఖ బంపర్ ఆఫర్

రీల్ పెట్టు.. అవార్డు కొట్టు – తెలంగాణ అటవీశాఖ బంపర్ ఆఫర్

schedule yuvaraju

తెలంగాణ అటవీశాఖ: రాష్ట్ర అవతరణ సందర్భంగా ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా 21 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే జూన్ 19వ తేదీన హరితోత్సవం నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే పచ్చదనం ప్రాముఖ్యత, హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నిమిషం నిడివి ఉండేలా రీల్స్, వీడియోలను ఆహ్వానించింది. ఇందులో బెస్ట్ గా ఉండే వాటిని ఎంపిక చేసి అవార్డులను అందజేస్తామని తెలంగాణ అటవీశాఖ ప్రకటించింది. ఇక నెటిజన్లు చేసే రీల్స్ కానీ వీడియోలను tkhh2023@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.