Home   »  వార్తలుతెలంగాణ   »   PLAY స్కూల్‌లో అగ్నిప్రమాదం

PLAY స్కూల్‌లో అగ్నిప్రమాదం

schedule sirisha

హైదరాబాద్: హైదరాబాద్ మణికొండలోని జాలీ కిడ్స్ PLAY స్కూల్‌లో ఈ రోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. play స్కూల్ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అన్నారు.

“ప్రారంభంలో ఓవర్‌లోడ్ కారణంగా ఒక చిన్న విద్యుత్ స్పార్క్ అంటుకొని AC లో మంటలకు దారితీసింది” వెంటనే పిల్లలందరినీ బయటికి పంపించారు.

ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని రాయదుర్గం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు.