Home   »  జాతీయంతెలంగాణవార్తలు   »   తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్..RRR ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్..

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్..RRR ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్..

schedule yuvaraju

తెలంగాణ: దేశంలోనే తొలి RRR ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొత్తం 350 కిలోమీటర్ల RRR రైల్వే తెలంగాణలోని చాలా జిల్లాలను కలుపుతుందన్నారు. రూ. 26వేల కోట్ల ఖర్చుతో రూపొందిస్తున్న ప్రాజెక్టు ఇదన్నారు. ప్రాజెక్టు వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగందన్నారు. రూటు ఎలా ఉండాలనేదానికి 99 శాతం ఆమోదం లభించిందన్నారు. భూసేకరణ ఖర్చు 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించింది. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టు ఔటర్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు సర్వే త్వరలో మొదలుకానుంది.

సర్వే కోసం రైల్వే శాఖ రూ. 14 వేల కోట్లు కేటాయించిందన్నారు. RRR ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్ తో హైదరాబాద్‌కు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఔటర్ రైల్ ద్వారా మేలు కలుగుతుందన్నారు. ఇందులో హసన్‌పర్తి-కరీంనగర్‌ రైల్వే లైన్ కోసం సర్వే జరిగిందన్నారు. RRR రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.