Home   »  జీవన శైలివార్తలు   »   హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం : IMD

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం : IMD

schedule sirisha

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో జూలై 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.

హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు అంటే చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD తెలిపింది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిన్న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33.1 డిగ్రీలు, 22.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.