Home   »  తెలంగాణరాజకీయంవార్తలు   »   తెలంగాణ బీజేపీపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ బీజేపీపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

schedule raju

హన్మకొండ: తెలంగాణ బీజేపీలో ఇటీవల కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. BJP చీఫ్‌గా కిషన్‌రెడ్డి, ఎన్నికల ప్రచార సారథిగా ఈటల ప్రమోషన్‌ పొందారు. దీంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ఈటల రాజేందర్ సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీపై కొందరు విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోంది. ఒక్కసారిగా పైకి వెళ్లి కిందపడేందుకు.. బీజేపీ బలం సెన్సెక్స్ కాదు. బీజేపీలో విభేదాలకు తావు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ గడ్డపై తన విజయ పరంపర 2019 ఎంపీ ఎన్నికలతోనే ప్రారంభమైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు GHMC ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. గతంలోనూ BJP నైతికంగా గెలిచిందన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగం అంతా కలిసి ప్రధాని సభను విజయవంతం చేస్తుందని అన్నారు. సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని మోదీ సూచించారు. అలాగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టే సత్తా తెలంగాణ జాతికి, బీజేపీకి ఉందని స్పష్టం చేశారు.