Home   »  జీవన శైలితెలంగాణవార్తలు   »   సికింద్రాబాద్ బోనాల పండుగ వేడుక కోసం మార్గాల మళ్లింపు

సికింద్రాబాద్ బోనాల పండుగ వేడుక కోసం మార్గాల మళ్లింపు

schedule sirisha

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు సంబంధించి జూలై 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జూలై 10న జాతర ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులను పార్కింగ్ ఏర్పాట్లను సిటీ పోలీసులు ప్రకటించారు.

రాణిగంజ్, ఓల్డ్ పిఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్, వైఎమ్‌సిఎ, ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, రోడ్లు మరియు జంక్షన్‌ల మీదుగా కాకుండా వేరే రహదారులలో వెళ్లవలసిందిగా పోలీసులు ప్రజలను కోరారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని పోలీసులు కోరారు.

“సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రజలు చిలకలగూడ వైపు నుండి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ 10 మీదుగా తొందరగా చేరుకుంటారు అని తెలిపారు. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది” అని నగర పోలీసులు తెలిపారు.