Home   »  తెలంగాణవార్తలు   »   తెలంగాణలో పచ్చదనం 8 శాతం పెరిగింది: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పచ్చదనం 8 శాతం పెరిగింది: మంత్రి కేటీఆర్

schedule raju

హైదరాబాద్: తెలంగాణ హరితహారం 8 శాతం పెరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ మేరకు పచ్చదనాన్ని పెంచలేదని, పచ్చదనం వృద్ధిలో తెలంగాణలోనే అత్యధిక శాతం ఉందన్నారు. తెలంగాణలో పచ్చదనం 3 శాతం పెరిగిందని గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో తెలంగాణ ప్రభుత్వ హరితహారాన్ని కొనియాడారు. తెలంగాణ పచ్చదనాన్ని 3 శాతం పెంచిందని, ఇదో అద్భుతమైన ప్రయత్నమన్నారు. ఎరిక్ తన ట్వీట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇలాంటి నాణ్యమైన మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగిందని, ఈ సీజన్‌లో మళ్లీ ఆరోగ్యవంతమైన మొక్కలు నాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎరిక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే గ్రీన్ బెల్ట్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో 3 శాతం కాదు వాస్తవంగా 8 శాతం పెరిగిందని దేశంలోనే అత్యధికమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 12,769 గ్రామాలు, 142 మున్సిపాలిటీల్లో నర్సరీలు ఉన్నాయని, అన్ని నర్సరీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల నర్సరీలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణలో పచ్చదనం పెరగడానికి అనేక కారణాలను కూడా మంత్రి ప్రస్తావించారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరిత బడ్జెట్‌ను కేటాయించి హరితహారం శాతాన్ని నిర్దేశించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.