Home   »  వ్యాపారంఉద్యోగంవార్తలు   »   మహిళలకు మెకానిక్ మరియు కమర్షియల్ డ్రైవర్‌లుగా శిక్షణ

మహిళలకు మెకానిక్ మరియు కమర్షియల్ డ్రైవర్‌లుగా శిక్షణ

schedule sirisha

మహిళా సాధికారత కార్యక్రమంలో, ఇండోర్‌లోని బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా సమన్ సొసైటీతో కలిసి యాంత్రిక ప్రోగ్రామ్ కింద 200 మంది మహిళలకు ప్రొఫెషనల్ డ్రైవర్‌లుగా, మెకానిక్‌లుగా శిక్షణ ఇచ్చింది. 60 మంది మహిళలు ద్విచక్ర వాహన మెకానిక్‌లుగా, 140 మంది డ్రైవర్లుగా శిక్షణ పొందారు.

ఇండోర్ నగరంలో జూన్ 2023 నుండి వీరిలో పది మంది మహిళా మెకానిక్‌లు “మెకానిక్ ఆన్ వీల్స్” సేవలో భాగంగా ఉన్నారు. ప్రజల ఇళ్ల వద్ద ద్విచక్ర వాహనాలకు సర్వీసింగ్ చేస్తూ అవసరాన్ని బట్టి అత్యవసర రోడ్‌సైడ్ మరమ్మతులు చేస్తున్నారు.

ఈ ట్రైనీలలో మొదటి బ్యాచ్ ఇప్పుడు మాస్టర్ ట్రైనర్‌లుగా మారారు. క్రమంగా రెండవ బ్యాచ్ మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. చాలా మంది ట్రైనీలు టూవీలర్ షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఉపాధి పొందుతున్నారు. మరి కొందరు తమ సొంత గ్యారేజీలను కూడా ప్రారంభించారు.