Home   »  ఆంధ్రప్రదేశ్   »   నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించిన 29 మంది అరెస్ట్‌

నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించిన 29 మంది అరెస్ట్‌

schedule raju

Ongole: నకిలీ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉపయోగించి సంచలనం సృష్టించిన భూకబ్జా కేసుల దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు, ఎస్పీ మాలిక గార్గ్‌తో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ బుధవారం ఒంగోలులో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Ongole భూకబ్జాలపై 30 కేసులు నమోదు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మొత్తం 30 కేసులు నమోదు చేశామని, ఈ భూకబ్జాలలో ప్రమేయం ఉన్న 29 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పరారీలో ఉన్న వారిని వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని ఎస్పీకి కలెక్టర్ సూచించారు. పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సంబంధిత శాఖలు కలిసి పనిచేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ కె. నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతుమాధవన్, ట్రైనీ ఐఎఎస్ సౌరమాన్ పటేల్, ఒంగోలు ఆర్డిఓ విశ్వేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మరియదాసు, ఒంగోలు డిఎస్పీ కె. నారాయణ స్వామిరెడ్డి, దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, మార్కాపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి, డీఎస్పీ రామరాజు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: 4.07 లక్షల ఎకరాల ఎండోమెంట్ భూములను గుర్తించిన దేవాదాయ శాఖ