Home   »  ఆంధ్రప్రదేశ్   »   4.07 లక్షల ఎకరాల ఎండోమెంట్ భూములను గుర్తించిన దేవాదాయ శాఖ

4.07 లక్షల ఎకరాల ఎండోమెంట్ భూములను గుర్తించిన దేవాదాయ శాఖ

schedule raju

Temples: విజయవాడలో ఇప్పటివరకు 4,07,486 ఎకరాల ఎండోమెంట్ భూమిని గుర్తించామని, 2,80,712 ఎకరాల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) తెలిపారు. 61 వేల ఎకరాల వాణిజ్య, అటవీ, నదీ తీర భూములను కూడా గుర్తించామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎండోమెంట్ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలకు గురైన భూములను వెనక్కి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సత్యనారాయణ

మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధి పనుల టెండర్లలో పారదర్శకత పాటిస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెండర్లను పరిశీలించేందుకు కమిషనరేట్‌ కార్యాలయంలో అకౌంట్స్‌ వింగ్‌ను ఏర్పాటు చేశారు. టెండర్ల పరిశీలనకు కమిషనర్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 300 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో పలు దేవాలయాల (Temples) అభివృద్ది

రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ది పనుల కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. దాదాపు రూ.225 కోట్ల వ్యయంతో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం, రూ.150 కోట్లతో శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయం మరియు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాలను కూడా అభివృద్ది చేస్తున్నట్లు తెలియజేసారు. అదేవిదంగా సింహాచలం, ద్వారకా తిరుమల దేవాలయాలను కూడా త్వరలో అభివృద్ది చేయనున్నట్లు తెలియజేసారు. ఇప్పటికే వీటికోసం పలు టెండర్లను వెయ్యడం జరిగిందన్నారు.

ఈ టెండర్ల తో పాటు అభివృద్ది పనులు సజావుగా జరిగేలా, రూ.5 కోట్లకు పైబడిన దేవాలయాల అభివృద్ది పనుల టెండర్ల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ కమిషనర్ అద్యక్షతన రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయన్నునారు. పలు దేవాలయాల్లో ప్రసాదాలు తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థాల ధరలో హెచ్చుతగ్గులు గమనించామని తెలిపారు. ఈ వ్యత్యాసాన్ని నియంత్రించేందుకు ప్రధాన పదార్థాల ధరలను నిర్ణయించేందుకు ఒక రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) ఆమోదం పొందిన ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

3000 కొత్త దేవాలయాల (Temples) నిర్మాణం

దేవాదాయ శాఖ పరిధిలో శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.300 కోట్లతో 3000 కొత్త దేవాలయాల నిర్మాణ పనులు మరియు రూ.500 కోట్లతో దేవాలయాల పునరుద్దరణ పనులు చేయనున్నారు. ఈ పనుల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ సిబ్బంది లేనందున సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో అవసరం మేరకు సహాయక ఇంజనీర్లను, సూపర్వైజర్లను, టెక్నికల్ అసిస్టెంట్లను, డ్రాప్టుమ్యాన్ లను ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ ద్వారా అవుట్ సోర్సింగ్ పై భర్తీ చేస్తున్నట్లు తెలియజేసారు.

Also Read: 13 గంటల తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు… కుటుంబసభ్యుల భావోద్వేగం