Home   »  ఆంధ్రప్రదేశ్   »   Inner Ring Road Scam: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం… A14గా నారా లోకేష్.!

Inner Ring Road Scam: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం… A14గా నారా లోకేష్.!

schedule raju

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం (Inner Ring Road Scam) నిందితుల జాబితాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొని పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌

స్కిల్ స్కామ్‌ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు యొక్క అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చినట్లు ఏపీ సీఐడీ తెలిపింది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్‌కె హౌసింగ్ లిమిటెడ్‌కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్‌లతో పాటు ఇతరుల పేర్లను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం (Inner Ring Road Scam) అలైన్‌మెంట్‌

అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (IRR), సీడ్ క్యాపిటల్‌ అలైన్‌మెంట్‌లను ఉద్దేశపూర్వకంగా, గణించిన పద్ధతిలో నారాయణ గ్రూప్ సంస్థలకు చంద్రబాబు, నారాయణ అనవసరమైన సంపదను అందించేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

నారా లోకేష్‌ తన తండ్రిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు నిత్యం న్యాయవాదులతో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసు (Inner Ring Road Scam) లో లోకేష్‌ ఏ14గా ఉండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Also Read: Chandrababu Naidu | చంద్రబాబును కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ… ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్