Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు AP అసెంబ్లీ సమావేశాలు..

ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు AP అసెంబ్లీ సమావేశాలు..

schedule mounika

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 9 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చనే ఊహాగానాల దృష్ట్యా, ఫిబ్రవరి 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

AP Assembly

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 9 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వస్తున్న వేళ, ఫిబ్రవరి 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరి 5న గవర్నర్‌ ప్రసంగం, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను  ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఫిబ్రవరి 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్‌ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

AP Assembly | ప్రస్తుత అసెంబ్లీ స‌మావేశాలే YSRCPకి చివ‌రి స‌మావేశాలు..

ఈ ఏడాది ఏప్రిల్ లో AP అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో YSRCP ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ స‌మావేశాలే చివ‌రి స‌మావేశాలు కానున్నాయి. AP లో మ‌ళ్లీ కొత్త స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

కాగా, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫిబ్రవరి 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకం, అటవీ శాఖలో 689 ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నందున ఇది అమలు చేయలేని నిర్ణయమని టీడీపీ, ఇతర పార్టీలు పేర్కొన్నాయి.

ALSO READ: ముగిసిన AP కేబినెట్ సమావేశం..