Home   »  ఆంధ్రప్రదేశ్   »   హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన AP మంత్రి..!

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన AP మంత్రి..!

schedule mahesh

AP Minister Satyanarayana | ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించడం సాధ్యం కాదని AP విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విభజన హామీల సాధనే మా పార్టీ విధానమని ఆయన బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

interesting-comments-on-jointcapital-ap-minister

AP Minister Satyanarayana | AP రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని YCP నేత YV సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో YV సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని AP విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా సరే ఉమ్మడి రాజధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ఉమ్మడి రాజధాని అనేది YCP విధానం కాదన్నారు.

హైదరాబాద్ విశ్వనగరంలో ఎవరైనా నివసించవచ్చన్న బొత్స

చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి రావడం వల్లే APకి రాజధాని లేకుండా పోయిందని AP Minister బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్లు, డోర్ నంబర్లు లేని వారు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారన్నారు. రాజధాని అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదన్నారు. విభజన చట్టంలో రావాల్సిన వాటి కోసం ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్ విశ్వనగరమని అక్కడ ఎవరైనా నివసించవచ్చన్నారు. తనకు హైదరాబాద్‌లో ఇల్లు కూడా ఉందన్నారు. తాను AP మంత్రిని అయినంత మాత్రాన తన ఆస్తులను అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని ప్రశ్నించారు.

Also Read | CM నివాసాన్ని ముట్టడించిన ABVP కార్యకర్తలు..!