Home   »  ఆంధ్రప్రదేశ్   »   Ayesha Meera: అయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ విచారణ

Ayesha Meera: అయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ విచారణ

schedule raju

విజయవాడలో సంచలనం సృష్టించిన అయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఏఎస్పీ సీఆర్‌ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది.

ప్రధానాంశాలు:

  • అయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు
  • ముగిసిన సీబీఐ విచారణ
  • అయేషా డెడ్‌బాడీకి పంచనామా చేసినప్పుడు ఉన్న వెంకట క్రిష్ణ ప్రసాద్ ను సీబీఐ విచారించనుంది.

విజయవాడ: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసులో సాక్షుల విచారణ ముగిసింది. CBI క్యాంపు కార్యాలయంలో ఏఎస్పీ దాస్‌ బృందం ఆధ్వర్యంలో విచారణకు అయేషా మీరా కేసు న్యాయవాది శ్రీనివాస్‌, సాక్షి వెంకట క్రిష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ విచారణకు హాజరయ్యారు.

అనంతరం వెంకట క్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హత్య జరిగిన తరువాత ఏ టైంకు నేను హాజరు అయ్యానో సీబిఐ అధికారులు అడిగారు. ఆయేషా మీరా (Ayesha Meera) హత్య జరిగిన తరువాత నేనే స్వయంగా ఇంక్వెస్ట్ రిపోర్ట్ రాశాను.

మృతదేహంపై గాయాలు ఉన్నాయా అని సీబిఐ అధికారులు అడిగారు. అప్పటి అధికారులు ఎవ్వరూ తెలుసా అని అడిగారు. ఆయేషా మీరా కుటుంబ సభ్యులకు నాకు ఉన్న పరిచయాల గురించి అడిగారు. ఈ కేసులో నిధితులను అరెస్టు చేయాలని విచారణకు వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నా. విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అరెస్ట్ చేసిన పరిస్థితులు లేవు. హత్య జరిగి 15 యేళ్లు అవుతుంది మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీబీఐ అధికారులు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నామని’’ సాక్షి వెంకట క్రిష్ణ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ  కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతుంది. విచారణలో భాగంగా ఆయేషా మీరా ఉన్న హాస్టల్​ వార్డెన్​ను సీబీఐ పిలిచి ప్రశ్నించింది.  2007 డిసెంబర్ 27 వ తారీఖున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యాచారానికి గురైంది.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో సత్యంబాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా.. 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.  దీంతో  అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ విచారణ కొనసాగుతుంది.