Home   »  ఆంధ్రప్రదేశ్   »   Bhuvaneshwari Protest: యాక్షన్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం… భువనేశ్వరి నిరాహార దీక్ష

Bhuvaneshwari Protest: యాక్షన్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం… భువనేశ్వరి నిరాహార దీక్ష

schedule raju

Bhuvaneshwari Protest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు చాలా మంది బాధపడుతున్నారని TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక 97 మంది చనిపోయారని, వారి కుటుంబాలకు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపాడు. త్వరలోనే మృతుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతామని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari Protest) అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు.

అక్టోబర్ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష (Bhuvaneshwari Protest)

నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే ఈరోజు TDP పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీ నుంచి ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, మున్ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ 5 నిమిషాల పాటు నిరసన

అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. ప్రజలంతా లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలనీ చెప్పారు. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయని తెలియజేసారు.

జనసేన-టీడీపీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇరు పార్టీల నుంచి కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పోరాడుతామని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు పర్యటన

జనసేన అధినేత పవన్ రేపటి నుంచి 4 రోజుల పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. ఇందులో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొని TDP యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు.

Also Read: Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3కి వాయిదా