Home   »  ఆంధ్రప్రదేశ్   »   CM జగన్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

CM జగన్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..

schedule mounika

ముఖ్యమంత్రి Y.S జగన్‌ మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy)పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా సీఎం జగన్‌ను విష్‌ చేశారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

Jagan Mohan Reddy

C.M జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలి: ప్రధాని

ముఖ్యమంత్రి Y.S జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా C.M జగన్‌ను విష్‌ చేశారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

C.M జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజును Y.C.P శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలను, అన్నదానాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్నారు. A.P లోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు.

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో CM Jagan Mohan Reddy..

కాగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి Y.S జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమానికి క్రైస్తవ మత పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కేక్‌ కట్‌ చేశారు.

క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన CM

ఈ సందర్భంగా C.M జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, ఆప్యాయత, సహనం, త్యాగం వంటి ఆనందకరమైన లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని స్పష్టం చేశారు. ఈ గుణాలు మాత్రమే మనం భగవంతుని దగ్గరకు వెళ్లేందుకు దోహదపడతాయని, ఇలాంటి మంచి గుణాలన్నిటినీ భగవంతుడు మనలో ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం, కొవ్వుత్తులు వెలిగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ తన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్‌ అవార్డులను ప్రదానం చేశారు.

ALSO READ: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల..