Home   »  ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణవార్తలు   »   బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ…

బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ…

schedule mounika

భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్‌ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్‌కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రంలో ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్‌ ఆర్మీకి డెలివరీ కానున్నాయి. కాగా, ఈ హెలికాప్టర్ల బాడీ ఫ్యూజ్‌లేజ్‌లు హైదరాబాద్‌లోనే టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌,టీబీఏఎల్‌, ప్లాంట్‌లోనే రెడీ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది. ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్‌లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్‌ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్‌ 2022 ఈ-మోడల్‌ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. దీంతో ఇండియన్‌ ఆర్మీ కోసం 6 ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది. . వచ్చే ఏడాదిలోగా వీటిని అంచాలన్నది డీల్‌.

ఏహెచ్‌64 ఈ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్‌గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్‌ మెసా ప్లాంట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అటాక్‌ హెలిక్యాప్టర్‌ ప్రోగ్రామ్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు. ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ ట్విన్‌-టర్బోషాఫ్ట్‌ అటాక్‌ హెలికాప్టర్‌ ఇందులో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ ఉంటుంది. తక్కువ ఎత్తులోనూ సమర్థంగా పనిచేయగలదు. 280kmph గరిష్ఠ ఎత్తులోప్రయాణించే వేగం అందుబాటులో 16 యాంటి-ట్యాంక్‌ ఏజీఎం-114 హెల్‌ఫైర్‌, స్ట్రింగర్‌ మిస్సైల్స్‌, హైడ్రా-70 అన్‌గైడెడ్‌ మిస్సైల్స్‌ శత్రువులపై బుల్లెట్ల దాడి కోసం 1,200 రౌండ్ల సామర్థ్యంతో 30-ఎంఎం చైన్‌ గన్‌. నిమిషానికి 600-650 రౌండ్లు ఫైర్‌ చేయవచ్చు.