Home   »  ఆంధ్రప్రదేశ్   »   APలో పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌ కు పాల్పడుతున్నారు: బోండా ఉమామహేశ్వరరావు

APలో పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌ కు పాల్పడుతున్నారు: బోండా ఉమామహేశ్వరరావు

schedule mounika

విజయవాడ: APలో పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌ (Phone tapping) కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని TDP రాష్ట్ర కార్యాలయంలో ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, JSP అధినేత పవన్‌ కల్యాణ్‌, EC ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని IPS అధికారులు IPS నిబంధనలకు బదులు ‘YSRCP’ నిబంధనలను పాటిస్తూ YSRCPకి వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. తాడేపల్లికి పాలేరుగా పనిచేస్తున్న ఎస్పీ రిషాంత్ రెడ్డి లిక్కర్, డబ్బు పంచే పనిలో ఉన్నాడని బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పోలీస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి లక్ష్యమనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమరనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్రువీకరించారని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

ALSO READ: Sharmila met | నేడు YSR జిల్లా కాంగ్రెస్ నేతలతో షర్మిల భేటీ..!