Home   »  ఆంధ్రప్రదేశ్   »   Cabinet Meeting: ఈ నెల 20న ఏపీ కేబినెట్ మీట్

Cabinet Meeting: ఈ నెల 20న ఏపీ కేబినెట్ మీట్

schedule raju

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఈ నెల 20న భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నేతృత్వంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. కాగా, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (ap assembly meeting) అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రధానాంశాలు:

  • నెల 20న ఏపీ కేబినెట్ భేటీ
  • అసెంబ్లీ సమావేశాలపై చేర్చించే అవకాశం
  • అయిదు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Also Read: Jagan: శాంతిభద్రతలపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఈ నెల 20న భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నేతృత్వంలో కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి మండలి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది. అలాగే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

Also Read: Custody Petition: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట…. కస్టడీ పిటిషన్‌పై విచారణ 19వ తేదీకి వాయిదా

దీంతో పాటు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల (ap assembly meeting)పై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని నిర్వహించాలి? ఏ బిల్లులు పెట్టాలన్న దానిపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై కూడా మంత్రులతో జగన్ చర్చించనున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) పై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు విఫలమయ్యారని కూడా జగన్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారనుంది.

కాగా, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (ap assembly meeting) అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.

అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 

ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.