Home   »  ఆంధ్రప్రదేశ్   »   చంద్రబాబు “రా కదలి రా” పర్యటన షెడ్యూల్ ఖరారు..!

చంద్రబాబు “రా కదలి రా” పర్యటన షెడ్యూల్ ఖరారు..!

schedule raju
Chandrababu Ra Kadali Ra tour schedule finalized

Ra Kadali Ra | మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు, రాప్తాడు పర్యటనల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మార్చి 2న చంద్రబాబు నాయుడు నెల్లూరు, గురజాలలో పర్యటించనున్నారు. దీనికి తోడు YCP రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మార్చి 2వ తేదీ ఉదయం నెల్లూరులో చంద్రబాబు నాయుడు సమక్షంలో TDPలో చేరనున్నారు. అదే రోజు గురజాలలో జరిగే “రా కదలి రా” సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

అలాగే మార్చి 4న చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 22 “రా కదలి రా” సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తమ ప్రచారంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో “రా కదలి రా సభ” నిర్వహిస్తోంది.

Also Read: CM జగన్ సమక్షంలో YCPలో చేరిన మాజీ మంత్రి..!