Home   »  ఆంధ్రప్రదేశ్   »   సాయంత్రం వరకు సిట్ కార్యాలయంలో నారా లోకేష్‌… విచారించనున్న CID

సాయంత్రం వరకు సిట్ కార్యాలయంలో నారా లోకేష్‌… విచారించనున్న CID

schedule raju

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ (Nara Lokesh) సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో లోకేష్ ఏ14గా ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో లోకేశ్‌ను అధికారులు విచారించనున్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ-14గా లోకేష్ (Nara Lokesh)

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న లోకేష్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చింది. హెరిటేజ్ బోర్డు తీర్మానాలు, ఖాతా పుస్తకాలను తీసుకురావాలని నోటీసులో సూచించారు. అయితే ఈ నోటీసులపై లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో ఇష్టానుసారంగా మార్పులు

దీంతో హెరిటేజ్ తీర్మానాలు, ఖాతా పుస్తకాలపై ఒత్తిడి చేయొద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్డ్ భూములను మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేష్, పొంగూరు నారాయణ దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

94 కి.మీ పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు 94 కి.మీ పొడవుతో అలైన్ మెంట్ ను సీఆర్ డీఏ అధికారులు డిజైన్ చేశారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన్న వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళుతుంది. ఇందులో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది.

Also Read: చంద్రబాబు SLP పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు