Home   »  ఆంధ్రప్రదేశ్   »   CM Jagan Bus Yatra | నేటి నుండి ప్రారంభం కానున్న జగన్ బస్సు యాత్ర..!

CM Jagan Bus Yatra | నేటి నుండి ప్రారంభం కానున్న జగన్ బస్సు యాత్ర..!

schedule raju

CM Jagan Bus Yatra | AP CM జగన్ నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. రెండో విడత బస్సు యాత్రను ‘మేమంతా సిద్ధం’ పేరుతో నేటి నుంచి CM జగన్ చేపట్టనున్నారు.

CM Jagan Bus Yatra to start from today

ఆంధ్రప్రదేశ్: AP సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత ప్రచారం కోసం CM, YCP అధినేేత జగన్ (CM Jagan) సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు రెండో విడత ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో నేటి నుంచి CM జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.

ఇడుపులపాయ నుంచి CM Jagan Bus Yatra

అయితే, నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర (CM Jagan Bus Yatra)తో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. CM జగన్ బుధవారం ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్ననానికి ఇడుపులపాయకు చేరుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మధ్యాహ్నం 1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేస్తారు.

ఈ యాత్ర 21 రోజులపాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఇందులో భాగంగా రేపు గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర (CM Jagan Bus Yatra) జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోకజవర్గాలు మినిహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది.

వివిధ వర్గాలతో CM జగన్ సమావేశం

యాత్రలో భాగంగా నిత్యం ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. ప్రతి రోజూ ఉదయం ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించి, అన్ని స్థాయిల వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్టు YCP వర్గాలు వెల్లడించారు. రోడ్ షోలతో పాటు అయా నియోజకవర్గ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా CM ప్రసంగాలు ఉండనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Also Read: Chandrababu Tour In Kuppam | కుప్పంలో నేడు చంద్రబాబు రెండో రోజు పర్యటన..!