Home   »  ఆంధ్రప్రదేశ్   »   చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి… తీర్పును రిజర్వ్‌ చేసిన ఏసీబీ కోర్టు

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి… తీర్పును రిజర్వ్‌ చేసిన ఏసీబీ కోర్టు

schedule raju

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై (Chandrababu custody) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియగా, ప్రస్తుతం కస్టడీ పిటిషన్‌ (Chandrababu custody)పై విచారణ జరిగింది.

ఇరుపక్షాల వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌

సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రాసిక్యూషన్, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దూబే ఇద్దరు వారి వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచి, సోమవారం తీర్పును ప్రకటిస్తామని తెలిపారు. అదనంగా, సోమవారం నాడు ACB కోర్టు PT వారెంట్లను కూడా విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ సోమవారం రోజున జరుగుతుందని సూచిస్తుంది.

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి (Chandrababu custody) ఇవ్వాలని అభ్యర్ధన

కస్టడీ పిటిషన్‌ (Chandrababu custody)పై విచారణ సందర్భంగా.. చంద్రబాబు బ్యాంకు ఖాతా వివరాలను సేకరించేందుకు ఆయనను అదుపులోకి తీసుకోవాలని పొన్నవోలు సుధాకర్ అభ్యర్థించారు. ఇప్పటికే అతని ఆదాయపు పన్ను వివరాలను సీఐడీ అధికారులు రాబట్టగా, వారి విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రపైనా, ఇతరులకు డబ్బు పంచడంపైనా విచారణ చేయాల్సిన అవసరం ఉందని పొన్నవోలు తెలియజేసారు. దీంతో వారు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.

కేసు డైరీ సమర్పించలేదని న్యాయవాది దూబే వివరణ

కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారని, విచారణకు చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు. కస్టడీ ముగిసినా ఇప్పటి వరకు కేసు డైరీ సమర్పించలేదని న్యాయవాది దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడిదని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

Also Read: నేడు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం జగన్