Home   »  ఆంధ్రప్రదేశ్జాతీయంవార్తలు   »   కాలువలో కొట్టుకొస్తున్న శవాలు.. కలకలం రేపుతోన్న డెడ్ బాడీలు..

కాలువలో కొట్టుకొస్తున్న శవాలు.. కలకలం రేపుతోన్న డెడ్ బాడీలు..

schedule yuvaraju

ఆంధ్రప్రదేశ్: ఒకేరోజు కృష్ణాజిల్లాలోని బందరు కెనాల్‌ వెంబడి 3 శవాలు కొట్టుకురావడం కలకలం రేపింది. నిన్న కాల్వలో కారులో గల్లంతైన అవనిగడ్డకు చెందిన రత్న భాస్కర్ కోసం పోలీసులు నిన్న వెతకగా గంట తర్వాత ఓ మృతదేహం బంధర్ కాలువలో లభ్యమైనది. దీంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీయలేక, అక్కడ వదిలేయలేక జుట్టు పీక్కుంటున్నారు. అయితే మృత దేహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే వాటికి పోలీసులు కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు. కాల్వలో తేలియాడుతున్న మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోతుండడంతో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కాలువలో కొట్టుకోస్తున్న మృత దేహాల వ్యవహారంలో బాధితులు ఎవ్వరూ అనేది కూడా అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి. విజయవాడ నుంచి మొదలు కొన్ని కిలోమీటర్ల మేర పారుతున్న కాలువలో ఈ మృత దేహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా..? లేదా ప్రమాదవశాత్తు జరిగిన మరణాల అనేవి మిస్టరీగా మారాయి. ఇలా నీళ్లు వదిలిన ప్రతిసారి వారంలో కనీసం రెండు సార్లు ఇలా శవాలు కొట్టుకొస్తయని, ఈ ఒక్కరోజే మూడు మృత దేహాలు కనిపించాయని స్థానికులు అంటున్నారు. అయితే డెడ్ బాడీలు కనిపించిన ప్రతిసారి పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇటువైపు కన్నెత్తి కూడా చూడరని, వ్యవసాయ పనులకు లేదా కాలువలు దాటెప్పుడు మృత దేహాలను చూసి భయపడుతున్నామని అంటున్నారు.