Home   »  ఆంధ్రప్రదేశ్   »   విజయవాడ-అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు..!

విజయవాడ-అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు..!

schedule raju
AP Chambers seeks direct flights between Vijayawada and Ayodhya

విజయవాడ: విజయవాడ-అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసును (flights between Vijayawada to Ayodhya) ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ (ap chambers) మంగళవారం ఇండిగో CEOకు వినతిపత్రం సమర్పించింది.

AP ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ.. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనదని మరియు 2024 జనవరిలో దీనిని ప్రతిష్టించినప్పటి నుండి ఇది ఒక కొత్త యాత్రాస్థలంగా ఆవిర్భవించిందని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి హిందువులు అయోధ్యను సందర్శిస్తున్నారని తెలిపారు.

“విజయవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో రామభక్తులు ఉండటంతో విజయవాడ నుండి అయోధ్యకు నేరుగా విమానాలు (flights between Vijayawada to Ayodhya) లేనందున, భక్తులు హైదరాబాద్ / బెంగళూరు నుండి అయోధ్య చేరుకోవడానికి విమానాలలో ప్రయాణించాల్సి వస్తుంది. అంతేకాకుండా, విజయవాడ నుండి అయోధ్యకు నేరుగా రైళ్లు కూడా లేవు. దీనితో భక్తులు వారణాసి లేదా న్యూ ఢిల్లీ జంక్షన్‌లలో మరో రైలు ఎక్కి అయోధ్య చేరుకుంటున్నారు. భక్తులకు అయోధ్య చేరుకోవడానికి మొత్తం రైలు ప్రయాణం సుమారు 40 గంటలు పడుతుంది ”అని ఆయన తెలిపారు.

Also Read: ఇకపై అయోధ్యలో కాల్పులు, కర్ఫ్యూలుండవన్న UP CM